Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు
Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Viral Incident: ప్రస్తుతం వివాహ వ్యవస్థ తీరు మారుతోంది. పెళ్లంటే చదువు, ఉద్యోగం, భారీగా సంపాదన ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. సంపాదన, ఉద్యోగం లేకుంటే పెళ్లి చేసుకోవడానికి వధువులు నిరాకరిస్తున్నారు. అమ్మాయిల ఆలోచన ధోరణిలో మార్పులు వస్తుండడంతో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. ఇలాగే ఓ అబ్బాయి పెళ్లి కోసం అబద్ధం ఆడితే పెళ్లి పీటలపైనే వధువు నిలదీసింది. దీంతో ఆ పెళ్లి కాస్త పెటాకులయ్యింది.
Also Read: Biryani In Lord Ram Plates: దేవుడా! శ్రీరాముడి ప్లేట్‌లో చికెన్ బిర్యానీ.. ఆందోళనలో భక్తులు
ఇంతకీ ఆ వధువు అడిగిన విషయం ఏమిటంటే 'రెండో ఎక్కం' చెప్పడం. తనకు కాబోయే భర్త చదువుకోలేదనే విషయం ఆలస్యంగా తెలుసుకున్న వధువు పెళ్లి మండపంపై వరుడిని లెక్కలు అడిగింది. ఎక్కం చెప్పకపోవడంతో అతడితోనే ఆమె పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్, బిర్యానీ, ఫ్రీ రైడ్
యూపీలోని మొహోబా జిల్లాలో మాల్సా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. మొదటి నుంచి చదువుకున్న వ్యక్తినే వివాహమాడుతానని కుటుంబసభ్యులకు చెప్పింది. అయితే ఓ వ్యక్తి కుటుంబం మాత్రం చదువుకున్నానని అబద్ధం చెప్పి మాల్సాతో విషయం నిశ్చయం చేశారు. ఇక పెళ్లి సమయం రానే వచ్చింది. ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు చేరుకున్నాడు. పూలమాలలు మార్చుకున్న అనంతరం పొరపాటున పెళ్లి కొడుకు నోరు జారాడు. 'నాకు ఈ మంత్రాలు, లెక్కలు రావు' అని చెప్పాడు.
ఇది విన్న వధువు మాల్సా ఆశ్చర్యపోయి అతడి గురించి అసలు విషయం తెలుసుకుందామని మండపంపైనే 'రెండో ఎక్కం' చెప్పాలని కోరింది. అనూహ్యంగా ఆమె లెక్కలు అడగడంతో అతడు తికమకపడ్డాడు. ఎక్కం చెప్పేందుకు ప్రయత్నించగా అతడికి వస్తే కదా? రెండో ఎక్కం కూడా రాదా? అని నిలదీయగా అసలు తాను చదువుకోలేదని వరుడు బయటపెట్టాడు. ఇది తెలుసుకున్న వధువు మాల్సా వెంటనే పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.
లెక్కలు రాకున్నా పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వధువు మాల్సా వినిపించుకోలేదు. దీంతో పెద్ద పంచాయితీ జరిగింది. యువతి పట్టువిడవకపోవడంతో చివరకు చేసేదేమీ లేక కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేశారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తుంటే.. అమ్మాయిలు మాత్రం 'అవును పెళ్లికి ముందే మోసం చేస్తే ఎలా' అని ప్రశ్నిస్తున్నారు. 'చదువుకున్న వాడు కావాలని కోరుకోవడం తప్పా?' అని నిలదీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter